ఆగని పరుగులో ఎండిన ఎడారులు

aagani paruguloo endina edaarulu

🎵 TG-1426🌐 Telugu
పల్లవి

ఆగని పరుగులో ఎండిన ఎడారులు (2) కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు ఉన్నపాటునా నలిగె నా వైపున కదలిరాలేవా ఆదరించగ రావా కన్నీరే నా మజిలీ – దరి చేరే నీ జాలి లాలించే నీ ప్రేమ – నా ప్రాణమై కరుణించే నీ చూపు – మన్నించే నా మనవి అందించే నీ చేయి – నా స్నేహమై ||ఆగని||

1వ చరణం

లోకప్రేమే సదా – కలల కడలే కదా తరంగమై కావుమా – తిరిగి తీరమునకు నీవే కదా ఆధారం – సదా నీకే దాసోహం యేసయ్యా… అర్పించెదా – నా జీవితం ఎదుట నిలిచె నీవే – ప్రేమకు రూపం నీవే కృపామయా కావుమా – జార విడువకు నన్ను నీవే కదా నా మూలం – సదా నీపై నా భారం యేసయ్యా… ప్రేమించెదా – కలకాలము

Report Error