ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర

aananda yaathra idi aathmeeya yaathra

🎵 TG-1010🌐 Telugu
పల్లవి

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర

1వ చరణం

యేసుని రక్తము పాపములనుండి విడిపించును (2) వేయి నోళ్ళతో స్తుతియించినను (2) తీర్చ లేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర||

2వ చరణం

రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండ (2) మనకు పరిచర్య చేయుటకొరకై (2) దేవదుతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర||

3వ చరణం

కృతజ్ఞత లేనివారు వేలకొలదిగ కూలినను (2) కృపా వాక్యమునకు సాక్షులమై (2) కృపవెంబడి కృపను పొందెదము (2) ||ఆనంద యాత్ర||

4వ చరణం

ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమాసనం (2) ఆత్మానంద భరితులమై (2) ఆగమన కాంక్షతో సాగెదం (2) ||ఆనంద యాత్ర||

Report Error