ఆనందం నీలోనే – ఆధారం

aanandam neeloonee – aadhaaram

🎵 TG-2811🌐 Telugu
పల్లవి

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు అర్హతేలేని నన్ను – ప్రేమించినావు జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం||

1వ చరణం

పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2) కలవరాల కోటలో – కన్నీటి బాటలో కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా సత్యవాక్యమే – జీవవాక్యమే సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోక మహిమ చూడక – నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం – నా ఆశయం

Report Error