ఆత్మ విషయమై దీనులైన వారు
aathma vissayamai deenulaina vaaru
🎵 TG-2054🌐 Telugu
పల్లవి
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది (2) దుఃఖ పడు వారలు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులైన వారు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు (2) ||ఆత్మ||
1వ చరణం
నీతిని ఆశించువారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు దేవుని కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు