అదే అదే ఆ రోజు

adee adee aa rooju

🎵 TG-2757🌐 Telugu
పల్లవి

అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే||

1వ చరణం

వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు (2) నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు భూకంపం కలిగే రోజు దిక్కు లేక అరచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు మిడతల దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు తప్పించే నాధుడు లేడు వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు అబద్ధికులు అరచే రోజు దొంగలంతా దొరికే రోజు పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక చేట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో బలము చూసి భంగ పడకుమా ధనము చూసి దగా పడకుమా

Report Error