అగ్ని మండించు – నాలో

agni mandinchu – naaloo

🎵 TG-2772🌐 Telugu
పల్లవి

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2) పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)       ||అగ్ని||

1వ చరణం

అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా

Report Error