నీతిగల యెహోవా స్తుతి మీయాత్మతో
neetigala yehoovaa stuti meeyaatmatoo
నీతిగల యెహోవా స్తుతి మీయాత్మతో నర్పించుఁడి మీయాత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుఁడి ||నీతిగల యెహోవా||
చదలఁ బుడమియు రవియు జలధియు నదులు గిరులును జక్కఁగా సదమలంబగు దైవనామము సర్వదా నుతిఁజేయను ||నీతిగల యెహోవా||
సర్వశక్తుని కార్యముల కీ సర్వరాష్ట్ర్రము లన్నియు గర్వములు విడి తలలు వంచుచు నుర్విలో నుతిఁజేయను ||నీతిగల యెహోవా||
గీత తాండవ వాద్యములచేఁ బ్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుఁడి ||నీతిగల యెహోవా||
పరమదూతలు నరులు పుడమిని మొరలుబెట్టుచు దేవుని పరము నందున్నట్టి యేసుని పాదములు సేవింతురు ||నీతిగల యెహోవా||
ఇలను భక్తుల గూడుకొనియా బలము గల్గిన దేవుని వెలయు స్తుతి వే నోళ్లతోడను విసుగు జెందక జేయుడి ||నీతిగల యెహోవా||
ఆత్మ నీవిఁక మేలుకొని శుద్ధాత్మఁ యేసునిఁ దండ్రిని త్రిత్వమగునా యేక దేవుని హర్షమున సేవింపవే ||నీతిగల యెహోవా||