భీకరుండౌ మా యెహోవా పీఠ
bheekarundau maa yehoovaa peetha
పల్లవి
భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటం గూడరే యేకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ మా||
1వ చరణం
మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభు న్మే మెచ్చుగా మది నెంతుము ||భీకరుండౌ మా||
2వ చరణం
ఏరితోడు లేక మము సర్వేశ్వరుఁడు సృష్టించెను ధారుణిం దా నొక్కఁడే మా దైవమని పూజింతుము ||భీకరుండౌ మా||
3వ చరణం
పుట్టగిట్టంజేయఁదానై నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్థులారా ప్రస్తుతింపరె భక్తిని ||భీకరుండౌ మా||
4వ చరణం
మేటి సంగీతంబులుపై మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను ||భీకరుండౌ మా||
5వ చరణం
మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను దిక్కులేని గొఱ్ఱె లట్లుఁ దిరుగఁజేర్పన్ మందను ||భీకరుండౌ మా||