సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో

sannutintumoo prabhoo sadamalamagu bhaktitoo

🎵 AKK-007💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో కన్నతండ్రి కావుమా కలుషము నెడబాపుమా ||సన్నుతింతుమో ప్రభో||

1వ చరణం

నీతిసూర్య తేజమా జ్యోతిరత్న రాజమా పాతకజన రక్షకా పతితపావన నామకా ||సన్నుతింతుమో ప్రభో||

2వ చరణం

మానవ సంరక్షకా దీన నిచయ పోషకా దేవమానవ నందనా దివ్య సుగుణ మందనా ||సన్నుతింతుమో ప్రభో||

3వ చరణం

ప్రేమ తత్వభోధకా క్షేమదాత వీవెగా కామిత ఫలదాయక స్వామి యేసు నాయక ||సన్నుతింతుమో ప్రభో||

4వ చరణం

పాపచింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో నీ పవిత్ర నామమున్ నిరతము స్మరియించెదన్ ||సన్నుతింతుమో ప్రభో||

Report Error