సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే
sarva shaktuni stootragaanamu salparee
పల్లవి
సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను నిర్వహించును దాస భారము నిత్య మెద రాజిల్లను ||సర్వ శక్తుని||
1వ చరణం
ముదముతో నిర్మాణ్కుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేఁడరే ||సర్వ శక్తుని||
2వ చరణం
వేదపారాయణము సేయుచు విశ్వ మంత జయింపరే సాదరముగా దేవునిఁక మీ స్వాంతమునఁ బూజింపరే ||సర్వ శక్తుని||
3వ చరణం
ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుగా నుతిఁజేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే ||సర్వ శక్తుని||
4వ చరణం
చావు పుట్టుక లేనివాఁడుగ సంతతము జీవించును ఈవు లిచ్చుచుఁ దన్ను వేఁడు మహేష్టులను రక్షించును ||సర్వ శక్తుని||
5వ చరణం
దాసులై దేవునికి నెదలో దర్పమును బోఁగాల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము నే మరక మైఁదాల్పరే ||సర్వ శక్తుని||