ఎంత ప్రేమ యెంత ప్రేమ

enta preema yenta preema

🎵 AKK-010💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుఁడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే ||ఎంత ప్రేమ||

1వ చరణం

ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని నింత యంతయని వచించు మనుజుఁ డెవ్వఁడు ||ఎంత ప్రేమ||

2వ చరణం

మనమునఁ దలపోయ నూహకంద దెంతయున్ దానిఁ జనువుఁగ జగమందుఁ బొగడ మాట లందవే ||ఎంత ప్రేమ||

3వ చరణం

దేవదూతలైన దానిఁ బాడలేరట యింక దేవుఁడే తన సుతు నొసంగి ఇంత యది యనెన్ ||ఎంత ప్రేమ||

4వ చరణం

ఇంత గొప్ప ప్రేమఁ జూప నూరకుందునే ప్రభు జెంతఁజేరి సంత తంబు ప్రీతిఁ జేసెదన్ ||ఎంత ప్రేమ||

Report Error