పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా

parishuddha parishuddha parishuddha prabhuvaa

🎵 AKK-020💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైన నిన్ వర్ణింపఁ గలరా ||పరిశుద్ధ పరిశుద్ధ||

1వ చరణం

పరిశుద్ధ జనకుఁడ పరమాత్మరూపుఁడ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా ||పరిశుద్ధ పరిశుద్ధ||

2వ చరణం

పరిశుద్ధ తనయుఁడ నరరూపధారుఁడ నరులను రక్షించు కరుణా సముద్రా ||పరిశుద్ధ పరిశుద్ధ||

3వ చరణం

పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ పరమానందప్రేమ భక్తుల కిడుమా ||పరిశుద్ధ పరిశుద్ధ||

4వ చరణం

జనక కుమారాత్మలను నేక దేవా ఘనమహిమ చెల్లును దనర నిత్యముగాఁ ||పరిశుద్ధ పరిశుద్ధ||

Report Error