వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ

vyooma sinhaasanasthunda yurvi paadapeethasthunda

🎵 AKK-022💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ మామకీన దయా మయుఁడ మమ్ముఁగావుమో దేవుఁడ ||వ్యోమ సింహాసనస్థుఁడ||

1వ చరణం

అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య స్వరూపా యింత నీ మహిమనోప నెంతది నా నాల్క చూప ||వ్యోమ సింహాసనస్థుఁడ||

2వ చరణం

గాలి ఱెక్కల పైనెక్కి గాఢాంధకారమునందు నేలికవై సంచరించు నట్టి నిన్ను మ్రొక్కుచుందు ||వ్యోమ సింహాసనస్థుఁడ||

3వ చరణం

నీతి న్యాయ దీర్ఘశాంతా నిర్మల దయా నితాంతా ప్రీతినుంచవే శ్రీమంతా పెద్దఁగా నా కాలమంతా ||వ్యోమ సింహాసనస్థుఁడ||

4వ చరణం

సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితా గర్వ దుస్స్వభా వాహితా కావునాన్ని నాట పితా ||వ్యోమ సింహాసనస్థుఁడ||

5వ చరణం

నమ్మిన యీనన్నఁ తూల నాడవు దీనాత్మపాలా క్రమ్మి నీ ప్రేమతోఁ జాల బ్రోతువు దయాలా వాలా ||వ్యోమ సింహాసనస్థుఁడ||

Report Error