రండి యుత్సహించి పాడుదము రక్షణ

randi yutsahinchi paadudamu rakshana

🎵 AKK-026💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ||రండి యుత్సహించి||

1వ చరణం

రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి యుత్సహించి||

2వ చరణం

మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్మ్యముగల రాజు భూమ్య గాధపులోయలును భూధర శిఖరము లాయనవే ||రండి యుత్సహించి||

3వ చరణం

సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిఁజేసెన్ ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి యుత్సహించి||

4వ చరణం

ఆ ప్రభు సన్నిధి మోఁకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును ||రండి యుత్సహించి||

5వ చరణం

తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుఁగాక ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగముల నౌను ఆమేన్ ||రండి యుత్సహించి||

Report Error