పల్లవి
దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయే యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు ||దహన బలి||
1వ చరణం
నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి ప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి ||దహన బలి||
2వ చరణం
అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్ ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు ||దహన బలి||