వేఁడెద నాదగు వినతిని గైకొనవే

veendeda naadagu vinatini gaikonavee

🎵 AKK-045💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో ||వేఁడెద నాదగు||

1వ చరణం

ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను ||వేఁడెద నాదగు||

2వ చరణం

నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా నీవు కరుణజేయు పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు ||వేఁడెద నాదగు||

3వ చరణం

పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్ నా పైనుంచుము నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్ ||వేఁడెద నాదగు||

4వ చరణం

నాదగు పాప భరం బంతయు నీ మీఁదనె యిడుచుందున్ నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్ ||వేఁడెద నాదగు||

5వ చరణం

అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్ భవదంఘ్రలపై నాదగు భక్తిని బ్రబలింపవే యేసు ||వేఁడెద నాదగు||

Report Error