నా యేసూ, ఆత్మ సూర్యుఁడా

naa yeesoo, aatma sooryundaa

🎵 AKK-054💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా యేసూ, ఆత్మ సూర్యుఁడా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమీ.

1వ చరణం

నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పనిచేయఁగా నా యొద్ద నుండు రక్షకా.

2వ చరణం

నాతోడ రాత్రింబగళ్లు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండినన్ జీవింపఁ జావఁజాలను.

3వ చరణం

నేఁడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపఱచి నీ మందలోకిఁ జేర్చుము.

4వ చరణం

రోగిని స్వస్థపఱచి బీదలను పోషించుమీ దుఃఖించువారి దుఃఖముఁ బాపి యానంద మియ్యుము.

Report Error