నీవు నా దేవుండవై యు

neevu naa deevundavai yu

🎵 AKK-071💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నీవు నా దేవుండవై యు న్నావు యేసు నాధ నీవిలఁ బ్రోవవే నన్నుఁ గావవే ||నీవు నా||

1వ చరణం

పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమా ధిపతి సర్వ భూపతి ||నీవు నా||

2వ చరణం

శ్రేయమౌ కా యంబు భక్తుల కీయ సిద్ధముఁ జేయు యేసు నాయకా మోక్ష దాయకా ||నీవు నా||

3వ చరణం

జీవ మారెడి త్రోవ నేఁబడి చావనై యున్నాను పతిత పావనా యాత్మ జీవనా ||నీవు నా||

4వ చరణం

జాగుసేయక బాగుసేయను రాఁగదె నే ఘోర పాప రోగిని దఃఖ భాగిని ||నీవు నా||

5వ చరణం

పాపమున నా రూపు మాపితి ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా కృపను జూపవా ||నీవు నా||

Report Error