మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార

mangalamee yeesunaku manujaavataarunaku shrungaara

🎵 AKK-073💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి ||మంగళమే యేసునకు||

1వ చరణం

పరమ పవిత్రునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిపుణ వద్యునకు ||మంగళమే యేసునకు||

2వ చరణం

దురిత సంహారునకు వరసుగుణోదారునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు ||మంగళమే యేసునకు||

3వ చరణం

సత్య ప్రవర్తునకు సద్దర్మశీలునకు నిత్యస్వయంజీవునకు నిర్మలాత్మునకు ||మంగళమే యేసునకు||

4వ చరణం

యుక్తస్తోత్రార్హూనకు భక్తరక్షామణికి సత్యపరంజ్యోతి యగు సార్వభౌమునకు ||మంగళమే యేసునకు||

5వ చరణం

నరఘోర కలుషముల నురుమారంగ నిల కరుదెంచిన మాపాలి వర రక్షకునకు ||మంగళమే యేసునకు||

6వ చరణం

పరమపురి వాసునకు నరదైవ రూపునకు పరమేశ్వర తనయునకు బ్రణుతింతుము నిన్ను ||మంగళమే యేసునకు||

Report Error