వందనమే యేసునకు వరుసుగుణోదారునకు సౌందర్య
vandanamee yeesunaku varusugunoodaarunaku saundarya
పల్లవి
వందనమే యేసునకు వరుసుగుణోదారునకు సౌందర్య ప్రభువునకు సర్వేశ్వర నీకు ||వందనమే యేసునకు||
1వ చరణం
యెహోవా తనయునకు ఇమ్మానుయేలునకు బహు కరుణాభరణునకుఁ ప్రభువుల ప్రభువునకు ||వందనమే యేసునకు||
2వ చరణం
ఆశ్రిత జనపాలునకు నకలుష వర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు యెహోవా నీకు ||వందనమే యేసునకు||
3వ చరణం
మరియాతనూజునకు మహిమ గంభీరునకుఁ పరిశుద్ధాచరణునకుఁ బరమేశ్వర నీకు ||వందనమే యేసునకు||
4వ చరణం
రాజులపై రాజునకు రవికోటి తేజునకుఁ పూజార్హపదాబ్జునకు భువనావన నీకు ||వందనమే యేసునకు||
5వ చరణం
ప్రేమ దయా సింధునకు క్షేమామృత పూర్ణునకు ఆమే నని సాష్టాంగము లర్పింతుము నీకు ||వందనమే యేసునకు||