పల్లవి
యేసు భజనయే మనలను ఆ సుగతికిఁ దీయు జనులారా దాసజనులు జేయు పలు దోసములు మోయు ||యేసు భజనయే||
1వ చరణం
మేల కులశీల వ్రత జా లాధిక మేల చాల మన మీలాగునఁ గాలావధి ఁగూల ||యేసు భజనయే||
2వ చరణం
అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత మోక్ష యను దీక్షన్ ||యేసు భజనయే||
3వ చరణం
మాటికి మిన్నేటికిఁ బో నేటికిఁ గాల్ నొవ్వ సూటిగ నరకోటి దురిత వాటములను మీటు ||యేసు భజనయే||
4వ చరణం
శ్రోత్రమ యపవిత్ర నర చ రిత్రలు వినఁబోక మైత్రిని బరమాత్ముని కథ మాత్రము విను మనుచున్ ||యేసు భజనయే||
5వ చరణం
మన జీవనమునకు మారుగఁ తన ప్రాణము నిచ్చెన్ తన రక్తముచేఁ బావన మొనరించెను మనలన్ ||యేసు భజనయే||