యేసుభజనసేయవే దోసపుమనసా! వాసిగ నేనే,

yeesubhajanaseeyavee doosapumanasaa! vaasiga neenee,

🎵 AKK-082💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసుభజనసేయవే దోసపుమనసా! వాసిగ నేనే, వరరక్షకుఁడు వేసారి వసుధ నెవ్వారినిఁ గానము ||యేసుభజనసేయవే దోసపుమనసా!||

1వ చరణం

ధారుణపాప భరణా! హరణా! కారుణ్యకరయని కోరిభజింపవె ||యేసుభజనసేయవే దోసపుమనసా!||

2వ చరణం

శాంతిసునీతి సదములభక్తిన్ వింతగనిడు మన శ్శాంతిసుధాకరుఁ ||యేసుభజనసేయవే దోసపుమనసా!||

3వ చరణం

అనఘా! నీవే అవనితలంబున ననుఁగనుఁగొంటివి నా ధనమంటివి ||యేసుభజనసేయవే దోసపుమనసా!||

4వ చరణం

మనసా! నీదు మలినంబును తా మనుగడ, సిల్వపై మాపెమహాత్ముఁ డు ||యేసుభజనసేయవే దోసపుమనసా!||

Report Error