ఏమి నేను సమర్పింతు యేసూ

eemi neenu samarpintu yeesoo

🎵 AKK-086💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు నీకు ||ఏమి నేను||

1వ చరణం

నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము ||ఏమి నేను||

2వ చరణం

అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు ||ఏమి నేను||

3వ చరణం

నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి నాలించు ||ఏమి నేను||

4వ చరణం

నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచు కొందును నేను సిగ్గు నొంది నిజముగఁ గుందుచు నేను వేఁడుకొందు నీ క్షమాపణ కొరకు ||ఏమి నేను||

5వ చరణం

నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు ||ఏమి నేను||

Report Error