క్రీస్తునాయక నీ దయాళిని కీర్తనలుగా

kreestunaayaka nee dayaalini keertanalugaa

🎵 AKK-090💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

క్రీస్తునాయక నీ దయాళిని కీర్తనలుగా బాడుదున్ నేస్తుతులతోఁ దండ్రి దేవుని నిత్యమును గొండాడుదున్ ||క్రీస్తునాయక నీ||

1వ చరణం

సిలువ మోసిన నీ ప్రయాసను జెప్పుటకు నోరాడదు అలుకునొందక స్వామి నీ ది వ్యాంఘ్రి చెంతను గూడుదు ||క్రీస్తునాయక నీ||

2వ చరణం

నిమిషమైన ంబాయకెదలో నిన్ను నే స్మరియింతును అమితమౌ దేవా ను క్రోశము హర్షముగ వర్ణింతును ||క్రీస్తునాయక నీ||

3వ చరణం

యేసుప్రభు నా కాలమంతయు నేమఱక నీ నామము దాసునిగ భజియంతు నిఁక నేఁ దప్పకుండను నీమము ||క్రీస్తునాయక నీ||

4వ చరణం

చచ్చి నే నరుదెంచి మోక్షము స్వామి నీ యుపకారముల్ హెచ్చు ప్రేమను బాడుచుందును యెప్పుడును గైవారముల్ ||క్రీస్తునాయక నీ||

5వ చరణం

మలినమౌ నా నత్తి నాల్క స మాధిలోఁ గృశియింపను బలిమితోనేఁ బాడుచుందును భక్తి యుజ్వలింపను ||క్రీస్తునాయక నీ||

6వ చరణం

కన్ను మూతలుగాను నీ సము ఖంబు కేను బిరాలను తెన్ను తప్పకవత్తు శ్రీకర దేవ నను నీవేలను ||క్రీస్తునాయక నీ||

7వ చరణం

ముగ్గురొకఁడై వెల్గుచుండెడి మోక్షరాజ్య గరిష్ఠుఁడా యొగ్గుచేయక నన్నుఁ బ్రోవవే యేసునాధ మహేశుఁడా ||క్రీస్తునాయక నీ||

8వ చరణం

భూతలములో నీ సమానముఁ బోల్చ నేదియుఁ గానము దాతవై మము సలుపవే నీ తండ్రికిని సంధానము ||క్రీస్తునాయక నీ||

Report Error