నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు

naa rakshakaa yeesunaadha immaanuyeelu

🎵 AKK-091💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు ఘోర పాపుల పాప భార విమోచక ||నా రక్షకా||

1వ చరణం

నిత్యకాలమునందు నిజమైన దేవుని సత్యవాక్యమై యున్న స్వామి నిన్నుతియింతు ||నా రక్షకా||

2వ చరణం

సర్వ లోకంబులను సత్యవాక్యమై యుండి నిర్వహించిన దేవుని నిజబాహువా స్తుతింతు ||నా రక్షకా||

3వ చరణం

దేవజనులకు సువార్త దెలుప నభిషేకంబు పూని నొందిన దేవపుత్రుడ నుతియింతు ||నా రక్షకా||

4వ చరణం

దేవ మహిమ ప్రకాశ దీనరక్షక మాను ష్యావతారము దాల్చి యావదాజ్ఞల దీర్చిన ||నా రక్షకా||

5వ చరణం

పావనాద్భుతుడవై పరమ జ్ఞానము దెల్పిన దేవస్వభావ ముద్ర దేదీప్యుడా స్తుతింతు ||నా రక్షకా||

6వ చరణం

పాపాత్ములను గావ శాపభారము క్రింద నోపికతో నిల్చి ప్రాపు జూపిన ప్రభువా ||నా రక్షకా||

7వ చరణం

ఈ వసుధను ప్రేమ నెసగునట్లుగ జూపి చావు గెల్చిన సర్వ సామర్థ్యుడా స్తుతింతు ||నా రక్షకా||

8వ చరణం

ఘన దేవుని కుడి పార్శ్వమున గూర్చుండి విజ్ఞప్తి నొనరించు నా యేసు వినయ స్తోత్రంబిదిగో ||నా రక్షకా||

Report Error