పల్లవి
యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసుకు శరణం ||యేసు పదాంబుజ||
1వ చరణం
దేవకుమారశరణం నర జీవప్రదాత శరణం దేవదేవ జగదావతారమము బ్రోవరావె ప్రభు నీవే శరణం ||యేసు పదాంబుజ||
2వ చరణం
పాపవినాశక శరణం నర శాపవిమోచక శరణం పావనాత్మ భవదీయ ప్రాణమిడి ప్రాపువైతివో ప్రభువా శరణం
3వ చరణం
పరమపురుషుడా శరణం ఓ నిరుపమప్రేమడ శరణం మరణ మొంది మరి మృత్యుంజయుడై పరమున జరిగిన ప్రభువా శరణం ||యేసు పదాంబుజ||
4వ చరణం
నీతిపూర్ణమా శరణం జగ జ్యోతి రత్నమా శరణం జాతిభేదరాహిత్యుడ హితుడా నీతిప్రబోధక నీవే శరణం
5వ చరణం
తేజోమూర్తికి శరణం విభ్రాజిత కీర్తికి శరణం రాజరాజ యో భారత రాజ్య ప్రజాత్మ రక్షక ప్రభువా శరణం