సమానులెవరు ప్రభో నీ సమానులెవరు

samaanulevaru prabhoo nee samaanulevaru

🎵 AKK-094💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమున్ సహించి వహించి ప్రేమించగల నీ ||సమానులెవరు ప్రభో||

1వ చరణం

సమాన తత్వము సహోదరత్వము సమంజసము గాను మాకు దెలుప నీ ||సమానులెవరు ప్రభో||

2వ చరణం

పరార్ధమై భవ శరీర మొసగిన పరోపకారా నరావ తారా ||సమానులెవరు ప్రభో||

3వ చరణం

దయా హృదయ యీ దురాత్ము లెల్లరిన్ నయాన భయాన దయాన బ్రోవ నీ ||సమానులెవరు ప్రభో||

4వ చరణం

ఓ పావనాత్ముడ ఓ పుణ్య శీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతనీ ||సమానులెవరు ప్రభో||

Report Error