యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు

yeesu kreestundu nitya deevundu

🎵 AKK-095💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు ఎఱిగి నమ్ముఁడి మనుజులారా మోస మొందక మోక్షపతికిఁక దాసులై బ్రతుకండి రండి ||యేసు క్రీస్తుఁడు||

1వ చరణం

ఆరు దినములలోపలనే యాకసము భూలోకములను ప్రాకటముగఁ జేసి నాఁడు ప్రకాశుఁడాయన ప్రజ్ఞవంతుఁడు ||యేసు క్రీస్తుఁడు||

2వ చరణం

ఆది పురుషుని యాదిస్త్రీనిఁక హస్తములతో నంటి చేసెను మేదినిన్ ఫలవనములో న సాధులై నివసింప నిచ్చెను ||యేసు క్రీస్తుఁడు||

3వ చరణం

వార లిద్దపు దేవునాజ్ఞను కోరికలతో మీరినప్పుడు గారడీ పిశాచ తంత్రము వారి పరమై పాపులైరి ||యేసు క్రీస్తుఁడు||

4వ చరణం

వీరలందఱు వారి సంతతి వేరెలేరీ ధరణిలో దు ష్యార్యులై దేవుని యాజ్ఞలు మీరి రందఱు నరక పాత్రులు ||యేసు క్రీస్తుఁడు||

5వ చరణం

ఇంత పాపభరితులై కా సంతసత్యము లేని నరుల నెంతగాఁ బ్రేమించెనో తన సొంత ప్రాణముఁ బలిగఁబెట్టెను ||యేసు క్రీస్తుఁడు||

6వ చరణం

పాపమించుకలేని కరుణా పావనుడు నరుఁడాయెను శాపగ్రస్తులమైన మన శాపములు తాఁజేతఁ బూనెను ||యేసు క్రీస్తుఁడు||

7వ చరణం

ఎన్నరాని బాధలొందుచు పుణ్యరక్తము జిందెనిలను ఎన్నఁడు నీలాటి ప్రేమ వన్నెలేదో యన్నలారా ||యేసు క్రీస్తుఁడు||

8వ చరణం

మనలఁ బాపమునుండి బాపను మనుజుఁడై మరణంబునొంది మన ప్రభువె మూఁడవ దినంబున మహినిలేచి పరము వెళ్లెను ||యేసు క్రీస్తుఁడు||

Report Error