శ్రీ రక్షకుని నామము కీర్తించి

shree rakshakuni naamamu keertinchi

🎵 AKK-097💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుఁడీ కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

1వ చరణం

పరేశుహత సైన్యమా మీ రాజు ఈయనే కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

2వ చరణం

నరులారా! మీ కోసము చావును నొందెను కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

3వ చరణం

సర్వ జనాంగములారా! శరణ్యుఁ డీయనే కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

4వ చరణం

పరంబునందు యేసుకుఁ కిరీట ముంచుచు హర్షంబుతోఁ గీర్తింతుము -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

Report Error