చింత లేదిఁక యేసు పుట్టెను

chinta leedinka yeesu puttenu

🎵 AKK-109💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

చింత లేదిఁక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునఁ చెంత జేరను రండి సర్వజనాంగమా సంతస మొందుమా ||చింత లేదిఁక||

1వ చరణం

దూత తెల్పెను గొల్లలకు శుభ వార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరఁగ వారు యేసును గాంచిరి స్తుతు లొనరించిరి ||చింత లేదిఁక||

2వ చరణం

చుక్కఁ గనుగొని జ్ఞాను లెంతో మక్కువతో నా ప్రభుని గను గొన చక్కఁగా బెత్లెముపురమున జొచ్చిరి కానుక లిచ్చిరి ||చింత లేదిఁక||

3వ చరణం

కన్యగర్భమునందుఁ బుట్టెను కరుణగల రక్షకుఁడు క్రీస్తుఁడు ధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై ||చింత లేదిఁక||

4వ చరణం

పాప మెల్లను పరిహరింపను పరమ రక్షకుఁ డవతరించెను దాపుఁ జేరిన వారి కిడుఁ గడు భాగ్యము మోక్షభాగ్యము ||చింత లేదిఁక||

Report Error