సంతోషించుఁడి యందరు నాతో సంతోషించుఁడి

santooshinchundi yandaru naatoo santooshinchundi

🎵 AKK-113💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సంతోషించుఁడి యందరు నాతో సంతోషించుఁడి యొక వింతయగు కీర్తనఁ బాడ వచ్చితిని సంతోషించుఁడి నాతో ||సంతోషించుఁడి యందరు||

1వ చరణం

అంధకార మయమైన భూమి నా ద్యంతము వెలిఁగింప దాని యా వేశముఁ దొలఁగింప వందితుండు క్రీస్తేసు నాధుఁడు వచ్చెఁ బ్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుఁడి యందరు||

2వ చరణం

కాన నంధకారంబు దొలఁగఁ ప్ర కాశించెను లెండు మీరు ప్ర కాశింపను రండు మానవులను సంతోషపర్చనై మహిని నవతరించె భక్తుల మనము సంతసించె ||సంతోషించుఁడి యందరు||

3వ చరణం

మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె హృదయములఁ దగులఁ ప్రకాశించె మున్ను జేయఁబడిన వాగ్ధత్తము తిన్నగ నెరవేరె భక్తుల కన్ను లాస దీరె ||సంతోషించుఁడి యందరు||

4వ చరణం

ప్రీతియైన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను గలసికొని నాతోఁ పాడుచును నీ తరి దూరస్థుల కీ వార్తను నే తీరును నైనఁ దెలుపఁగ నాతురపడవలెను ||సంతోషించుఁడి యందరు||

5వ చరణం

పాపులపై దేవునికిఁ గలిగిన ప్రబలమైన దయను లోకమునఁ జూపింపఁ గవలెను జూపకపోయిన లోపము మనపై మోపఁబడును నిజము వేగము జూపుద మా పథము ||సంతోషించుఁడి యందరు||

Report Error