గీతములు పాడుఁడీ యేసునికి సం

geetamulu paadundee yeesuniki san

🎵 AKK-115💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

గీతములు పాడుఁడీ యేసునికి సం గీతములు పాడుఁడీ పాతకుల మగు మనల దారుణ పాతకము తన విమలరక్త స్నాతులనుగాఁ జేసి పాపను భాతకులలో నవతరించెను ||గీతములు పాడుఁడీ||

1వ చరణం

రాజులకు రాజుగా నేలుచు మోక్ష రాజ్యమున కర్తగా బూజలందుచు దూత పరిగణ పూజితుండౌ ఘనుఁడు తన దగు తేజ మెల్లను విడిచి యీయిలఁ దేజహీనులలోనఁ బుట్టెను ||గీతములు పాడుఁడీ||

2వ చరణం

దాసులగు వారలన్ దమ పటు దోష త్రాస విముక్తులన్ జేసి వారల నెల్ల మోక్ష ని వాసులుగఁ జేయంగ రక్తముఁ బోసి కృపచేఁగావ వచ్చెను యేసు నాధుఁడు దీన వృత్తిని ||గీతములు పాడుఁడీ||

3వ చరణం

మానవుల కెల్లను దేవుని ప్రేమ మానుగాఁ జూపను మ్రానిపై దన రక్త మొసఁగఁగ మానవుండై పుట్టె యూదుల లోన యేసను పేరుచేఁదా దీనుఁడై యిమ్మానుయేలు ||గీతములు పాడుఁడీ||

4వ చరణం

ఆదిఁ దన వాక్యము నందున యేసు మోదమున్ నిట్లనెన మేదినిందా మనుజుఁడై యిఁక సాదరమ్మునఁ బ్రోవ మనుజుల నా దయాళుఁడు తనదు దేహము సాధుగా నర్పింతు ననుచును ||గీతములు పాడుఁడీ||

Report Error