లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు
lookamantata velugu prakaashinchenu yeesu
లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ||లోకమంతట వెలుగు||
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను చీకటి దాని గ్రహింప లేదు నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపువెలుగై యుండుడనె యేసు ||లోకమంతట వెలుగు||
ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైన నక్కరలేదు ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే దీపమై వెలుగుచుండు ||లోకమంతట వెలుగు||
మీరు లోకమునకు వెలుగై యున్నారు గనుక మీరు వెలుగు సంబంధులు మీరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే మరుగై యుండక నరులందరికి వెలుగై యుందురనె యేసుండు ||లోకమంతట వెలుగు||
చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద ప్రకాశించెను గొప్ప వెలుగును ప్రభువు యేసుకు జేయని పాడరే ||లోకమంతట వెలుగు||