లాలిలాలి లాలి లాలమ్మ లాలీ

laalilaali laali laalamma laalee

🎵 AKK-122💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలియని పాడరే బాలయేసునకు ||లాలిలాలి లాలి||

1వ చరణం

పరలోక దేవుని తనయుఁడో యమ్మా పుడమిపై బాలుఁడుఁగఁ బుట్టెనో యమ్మా ||లాలిలాలి లాలి||

2వ చరణం

ఇహ పరాదుల కర్త యీతఁడో యమ్మ మహి పాలనముఁ జేయు మహితుఁడో యమ్మా ||లాలిలాలి లాలి||

3వ చరణం

ఆద్యంతములు లేని దేవుఁడో యమ్మా ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా ||లాలిలాలి లాలి||

4వ చరణం

యూదులకు రాజుగాఁబుట్టెనో యమ్మా యూదు లాతని తోడ వాదించి రమ్మా ||లాలిలాలి లాలి||

5వ చరణం

నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా ||లాలిలాలి లాలి||

Report Error