క్రైస్తవులారా! లెండి యీనాడు క్రీస్తు

kraistavulaaraa! lendi yeenaadu kreestu

🎵 AKK-130💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

క్రైస్తవులారా! లెండి యీనాడు క్రీస్తు పుట్టెనంచు పాడుఁడి; ప్రసన్నుఁడైన తండ్రి ప్రేమను ఆసక్తిపరులై కీర్తించుఁడి క్రీస్తేను మానవాళితోడను నశింపవచ్చెనంచు పాడుఁడి.

1వ చరణం

దేవుని దూత గొల్లవారికి ఈ రీతిగాను ప్రకతించెనుః 'ఈ వేళ మహా సంతోషంబగు సువార్త నేను ఎరిగింతును. దావీదు పట్నమం దీదినము దైవరక్షకుఁడు జన్మించెను.'

2వ చరణం

త్వరగానే ఆకాశ సైన్యము హర్షించుచు నీలాగు పాడెను 'సర్వోన్న తాకాశంబునందుండు సర్వేశ్వరునికి ప్రభావము నరులయందు సమాధానము ధరణిలో వ్యాపింపనియ్యుఁడు'.

3వ చరణం

పరమతండ్రి దయారసము నరులకెంతో నాశ్చర్యము నరావతారుఁడగు దేవుఁడు నిరపరాధిగాను జీవించి నిర్దోషమైన త్రోవ చూపించి విరోధులన్ ప్రేమించుచుండెను.

4వ చరణం

శ్రీ మాత సైన్యముతో మేమును వాద్యములు వాయించుచుందుము; ఈ దినమందు నుద్భవించిన యా దివ్యకర్తను వీక్షింతుము; సదయుఁడైన యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందుము.

Report Error