రండి పాడ దూతలారా నిండు

randi paada dootalaaraa nindu

🎵 AKK-132💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రండి పాడ దూతలారా నిండు సంతోషంబుతో యేసుని జన్మంబు గూర్చి ఈ భూలోకమంతట రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

1వ చరణం

మందగాయు గొల్లలార! మనుష్యులతో నేడు వాసంబు జేయుచున్నాఁడు వాసిగాను దేవుండు రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

2వ చరణం

జ్ఞానులారా! మానుడింక యోచనలం జేయుట మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్ రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

3వ చరణం

పరిశుద్ధులారా! మీరు నిరీక్షించుచుండిన యేసు ప్రభువాలయంబు యేతెంచెను చూడుడి రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

4వ చరణం

పశ్చాత్తాప మొందియున్న పాపులార! మీకు వి ముక్తి గల్గె; శక్తి నొంది రక్తి నేసుంజేరుడి రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

Report Error