యేసు నామమే పావనము మాకు

yeesu naamamee paavanamu maaku

🎵 AKK-138💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము దాస జన హృద్వికాసమైయెల్ల దోసములకు వి నాశకరమైన ||యేసు నామమే||

1వ చరణం

సాధు మానసోల్లాసములు యేసు నాధు గుణ చిద్విలాసములు బోధఁ గొను వారి బాధ వెడలించి మాధుర్యమగు ముక్తి సాధనములిచ్చు. ||యేసు నామమే||

2వ చరణం

భక్త జన లోక పూజ్యములు రక్త సిక్త పాదపయోజములు ముక్త రాజ్యాభి షిక్తుఁడౌ సర్వ శక్తి యుతుఁడైన సామియగు క్రీస్తు ||యేసు నామమే||

3వ చరణం

దీన జన నిత్య తోషణము సిల్వ మ్రాని ప్రభు మృత్యు ఘోషణము పానకము జుంటి తేనియల స్వాదు వీనులను గ్రోలు మానవుల కెల్ల ||యేసు నామమే||

4వ చరణం

పాపులకు మంచి పక్షములు ముక్తిఁ జూపు క్రీస్తు కటాక్షములు పాప సందోహ కూపమునఁ గూలు కాపురుషు నన్నుఁగాచుకొనిప్రోచు ||యేసు నామమే||

Report Error