వరనామమే శరణము శరణము క్రీస్తు

varanaamamee sharanamu sharanamu kreestu

🎵 AKK-141💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

వరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే శరణము శరణం ||వరనామమే శరణము||

1వ చరణం

పరమభక్త వ్రాత దురిత సంఘాత దు స్తర వన జాత భీ కరకీలి యౌ క్రీస్తు ||వరనామమే శరణము||

2వ చరణం

సారహీన సం సార పారావార తారణ కారణ తరణి యైన క్రీస్తు ||వరనామమే శరణము||

3వ చరణం

యూద దేశమునందు నుండు బేత్లేహేమున యూదు లను జనులలో పాదుకొన్న క్రీస్తు ||వరనామమే శరణము||

4వ చరణం

ఇలలో పాపపు మాన వుల నెల్ల మోక్ష సం కలితులఁ జేయుఁగ సిలువ నొందిన క్రీస్తు ||వరనామమే శరణము||

5వ చరణం

ఏచియున్నట్టి పి శాచభారపు కాడి మోసి దుఃఖించెడు నీచులకును క్రీస్తు ||వరనామమే శరణము||

6వ చరణం

కొల్లగాను బాప మెల్లఁ జేసి దాని కుల్లములోఁదల్ల డిల్లువారికిఁ క్రీస్తు ||వరనామమే శరణము||

Report Error