క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి

kreestee sarvaadhikaari kreestee mookshaadhikaari

🎵 AKK-144💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే సర్వాధికారి||

1వ చరణం

ముక్తి విధాతనేత శక్తి నొసంగుదాత భక్తి విలాపశ్రోత పరమంబు వీడె గాన ||క్రీస్తే సర్వాధికారి||

2వ చరణం

దివ్యపథంబురోసి దైవంబు తోడుబాసి దాసుని రూపుదాల్చి ధరణి కేతెంచెగాన ||క్రీస్తే సర్వాధికారి||

3వ చరణం

శాశ్వత లోకవాసి సత్యామృతంపురాశి శాప భారంబు మోసి శ్రమల సహించెగాన ||క్రీస్తే సర్వాధికారి||

4వ చరణం

సైతాను జనము గూల్పన్ పాతాళమునకు బంపన్ నీతి పథంబు బెంప రుధిరంబు గార్చెగాన ||క్రీస్తే సర్వాధికారి||

5వ చరణం

మృత్యువు ముల్లు తృంపన్ నిత్యజీవంబు బెంపన్ మర్త్యాళిభయము దీర్పన్ మరణంబు గెలిచెగాన ||క్రీస్తే సర్వాధికారి||

6వ చరణం

పరమందు దివిజులైన ధరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగాన ||క్రీస్తే సర్వాధికారి||

7వ చరణం

ఈ నామమునకు మించు నామంబు లేదటంచు యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడు గాన ||క్రీస్తే సర్వాధికారి||

Report Error