నీవేయని నమ్మక యేసునాకు నీవేయని

neeveeyani nammaka yeesunaaku neeveeyani

🎵 AKK-145💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నీవేయని నమ్మక యేసునాకు నీవేయని నమ్మిక నీవే మార్గంబు నీవే సత్యంబు నీవే జీవంబు నీవే సర్వంబు ||నీవేయని నమ్మక||

1వ చరణం

పెడదారిని బోవగ నామీదికి ఇడుమలెన్నియొరాగ అడవిలోబడి నేను ఆడలుచు నుండగ తడవకుండ దొరుకు ధన్యుమౌ మార్గంబు ||నీవేయని నమ్మక||

2వ చరణం

కారుమేఘముపట్టగ నా మనస్సులో కటిక చీకటిపుట్టగ ఘోరాపదలుచేరి దారియని భ్రమపడగ తేరిచూడగల్గు తేజోమయ మార్గంబు ||నీవేయని నమ్మక||

3వ చరణం

లేనిపోని మార్గంబు లెన్నోయుండ జ్ఞానోపదేశంబు మానుగజేయుచు వానినిఖండించి నేనే మార్గంబన్న నిజమైన మార్గంబు ||నీవేయని నమ్మక||

4వ చరణం

నరలోకమునుండి పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా నడుచుచు ముక్తికి సరిగా కొనిపోవు సు స్థిరమైన మార్గంబు ||నీవేయని నమ్మక||

Report Error