ఎవరు భాగ్యవంతు లౌదు రవని

evaru bhaagyavantu laudu ravani

🎵 AKK-154💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులొగ్గి వినువారికన్న ||ఎవరు భాగ్యవంతు||

1వ చరణం

కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులు దవులఁ బోవఁ దరిమి యేసు తత్వముఁగొనువారికన్న ||ఎవరు భాగ్యవంతు||

2వ చరణం

దీనమానసుల కట్టి యుప దేశ మిచ్చెను దివ్య మైన మోక్ష రాజ్యము వారి దౌనటంచు ప్రభువు తెల్పె ||ఎవరు భాగ్యవంతు||

3వ చరణం

వృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారు నిజముగ నోదార్పుఁ బొంది నిత్య సంతోషింతు లని తెల్పె ||ఎవరు భాగ్యవంతు||

4వ చరణం

శాంతి నీతికరుణల యందా సక్తిగల వారు భూస్వతంత్రులై పరి తృప్తినొంది దయఁ బడసెద రని ప్రభువు తెల్పె ||ఎవరు భాగ్యవంతు||

5వ చరణం

పరిశుద్ధ హృదయులు పరా త్పరునఁ జూతురు సర్వ నరుల సమాధానపరచు నరులె పరమ జనకుని సుతులు ||ఎవరు భాగ్యవంతు||

6వ చరణం

నీతికొర కాపద నొందెడి నిశ్చ లాత్ములు వారు ఖ్యాతిగఁ బర లోక రాజ్య ఘన సౌఖ్యము లెల్లను బడయుదురు ||ఎవరు భాగ్యవంతు||

Report Error