వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు
vinarayya narulaaraa vishvaasamuna kreestu
వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ పాప మనుజుల కెల్ల పా వన జీవనము సేయు వసుధ మీఁద ||వినరయ్య నరులారా||
పాపాత్ములను పశ్చా త్తాపము పడుఁడంచు బ్రభువు దెల్పెన్ దన దాపు గోరినవారిఁ గాపాడుటకుఁ దానే దక్షుడయ్యెన్ ||వినరయ్య నరులారా||
భారాక్రాంతులైన పాపులఁ దనుఁ జేరఁ బ్రభువు పిల్చెన్ శ్రమలు దూరంబుఁ జేసిత ద్దురితముల్ బాపి సం తోష మియ్యన్ ||వినరయ్య నరులారా||
అనుమానింపక నెవ్వ రైన వచ్చినఁ ద్రోయ ననుచుఁ బల్కెన్ పెక్కు మనుజుల కొఱకు జీ వన మియ్యనే వచ్చి తనుచుఁ దెల్పెన్ ||వినరయ్య నరులారా||
మనసారదేవునిన్ మానక ప్రేమింపు మనుచునేర్పెన్ ఇంకఁ దన పోల్కె నొరులకు దాను బ్రేమింపగ దనర దెల్పెన్ ||వినరయ్య నరులారా||
తన శిష్యులకు నైక్య మును బ్రేమించుట కాజ్ఞ లొనర నిచ్చె నెంతో ఘన సత్ప్రభువు కాళ్లు గడిగి భక్తులచోట వినతుఁ డయ్యెన్ ||వినరయ్య నరులారా||