ఏలాటివాఁడో కాని యీ యేసుని
eelaativaandoo kaani yee yeesuni
పల్లవి
ఏలాటివాఁడో కాని యీ యేసుని నేమని వివరింతుము గాలివాన యేసుని గద్దింపునకుఁ చాల భయపడి నిలిచెను ||ఏలాటివాఁడో కాని||
1వ చరణం
ముద్దు శిష్యులతోడను సముద్రపు టద్దరికి వెళ్లెను కొద్ది పడవనెక్కెను ఇంతలోనె పెద్దగాలి రేగెను ||ఏలాటివాఁడో కాని||
2వ చరణం
అల్లకల్లోలముగా సముద్రము అల్లలాడు నప్పుడు చల్లఁగ దోనె వెనుక తలగడపైని మెల్లన నిదువోయెన్ ||ఏలాటివాఁడో కాని||
3వ చరణం
చింత లేదా యేమయ్యా బోధకుఁడా న శించిపోవుచున్నాము ఎంతో వేదన పడితిమి కాపాడుమ టంచు శిష్యులు లేపిరి ||ఏలాటివాఁడో కాని||
4వ చరణం
దిగ్గునఁ బ్రభువు లేచి యా గాలిని గద్దించిన వెంటనే తగ్గి నిమ్మళించెను సమస్తము సద్దు ఉడిగిపోయెను ||ఏలాటివాఁడో కాని||
5వ చరణం
ఏల భీతు లైతిరి యింతలోనే యెంత నమ్మిక లేదని యీలాగు నోదార్చెను యేసు తన సొంత శిష్యుల నప్పుడు ||ఏలాటివాఁడో కాని||