ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు
draakshaavallini neenu draakshaateegelu meeru
పల్లవి
ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు అక్షయు డేసిటు బలికె అతిముదమునను వినరండి ||ద్రాక్షావల్లిని నేను||
1వ చరణం
నాయందుండని తీగె నాశనమొందును నిజము నాశనమొందక మీరు నాయందుండుడి ఫలియింపన్ ||ద్రాక్షావల్లిని నేను||
2వ చరణం
ఫలముల నివ్వని తీగె పనికిరాదని నరికి పారవేయంబడును నిరతము తధ్యము నిప్పులలో ||ద్రాక్షావల్లిని నేను||
3వ చరణం
ఫలించు ప్రతి తీగె ఫలముల పెక్కుగ నివ్వన్ పరిశుద్ధి చేయబడున్ యెఱుగరే మీరది అనవరతం ||ద్రాక్షావల్లిని నేను||
4వ చరణం
నాయందుండినగాని నయమగు కాపుండదిలన్ నాయందుండిన వాడు నాణ్యపు ఫలములనిచ్చు నాహా ||ద్రాక్షావల్లిని నేను||
5వ చరణం
మీరు యేదియు చేయ లేరు నాకు వేరై వేరుగ మీరుండినచో వెంటనే యెండిపోయెదరు ||ద్రాక్షావల్లిని నేను||
6వ చరణం
కాన యేసుని యందు మానకనుందుము స్వేచ్ఛన్ మాన్యుడేసుని పలుకుల్ మదిదలచెద మిల మరువకను ||ద్రాక్షావల్లిని నేను||