ఇదిగో శుభద రక్షణము దేవుఁడు
idigoo shubhada rakshanamu deevundu
పల్లవి
ఇదిగో శుభద రక్షణము దేవుఁడు పంపె నిదిగో శుభద రక్షణము సదమలంబగు పూర్వ సత్యవాక్యమునందు మృదువుగా దీర్ఘ ద ర్శుల చేతఁ బలుకఁబడె ||ఇదిగో శుభద||
1వ చరణం
అలపిశాచముతోడను దేవుఁడు తొల్లిఁ బలుకు వాక్యము జాడను పొలతి సంతతి నిన్ను తలఁగొట్ట బుట్టునని తెలియఁజేసెను మోషె దీర్ఘ దర్శన వాక్య ||ఇదిగో శుభద||
2వ చరణం
ఘన దివ్య బలిచేయను పాపములెల్లఁ దునిమి పుణ్యము లియ్యను ఒనరఁగ నీ కాల మునఁ గ్రీస్తు వచ్చునని మును దానియేలు బ ల్కెను దీర్ఘ దర్శనము ||ఇదిగో శుభద||
3వ చరణం
యూద రాజ్యములోపట బెత్లేమనెడి యూరఁ గ్రీస్తుడు బుట్టుట ఆదిలోన మీకా యను దీర్ఘ దర్శిచే మోదమునఁ దెల్పబడె ముందు వేదమునందు ||ఇదిగో శుభద||
4వ చరణం
మన దోషముల కొఱకునై యేసుని కాయ మది గాయముల హ్రస్వమై మన రక్షకుని పాట్లు గనినట్టుల యెషయ్య మును దెల్పె దీర్ఘద ర్శన వాక్యముల నిచ్చి ||ఇదిగో శుభద||