వింతగల మా యేసు ప్రేమను

vintagala maa yeesu preemanu

🎵 AKK-161💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును పంతముగఁ దన ప్రాణమును పా పులకు నియ్యను వచ్చి సిలువను జచ్చి నను రక్షించె నహహా ||వింతగల మా||

1వ చరణం

ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతోఁ జాటింతును సాధుగా నాకొఱకు సిలువను చాల శ్రమల భరించి చావు జ యించి నను రక్షించె నహహా ||వింతగల మా||

2వ చరణం

పాడుఁడీ మా యేసు ప్రేమను వేఁడుఁడీ మదిఁ గూడుఁడీ పాడుఁడీ తన దివ్యరక్తము పాప క్రయముగ నిచ్చి శాపముఁ బాపి నను రక్షించె నహహా ||వింతగల మా||

3వ చరణం

నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగ నాకియ్యను రక్తస్వేదము గార్చె నహహా నరక శాపముఁ ద్రుంచి యాపద నుంచి నను రక్షించె నహహా ||వింతగల మా||

Report Error