పల్లవి
అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు ఎన్న రాని మన యఘము లన్ని సడలించి ప్రోచు ||అన్నా మన||
1వ చరణం
మన దోషములకు బదులుగ మరణావస్థల నొందెను తన దివ్యావయముల ర క్తము చిందించెను భువిపై ||అన్నా మన||
2వ చరణం
నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను విజయం బగు నతని పాద రజయుగ్మును స్మరించు ||అన్నా మన||
3వ చరణం
దిక్కు మాలిన వారికి దిక్కై మార్గముఁజూపెను చక్కనీ గుణముల సొం పెక్కి వర్తించె నహహ ||అన్నా మన||
4వ చరణం
ఈలాటి దయాసముద్రు నిల నెందైనను గానము నీలోఁ గల దుర్గుణాది జాలంబులఁ గడఁ ద్రోయును ||అన్నా మన||
5వ చరణం
మృతి గెల్చిన వాఁడే దు రిత జీవులఁ బ్రోవఁ దగును మృతి నొంది నశించు లోక మూఢాత్ముల కేలఁ గల్గు ||అన్నా మన||