యేసు శిష్యులకు నెరుక జేసిన

yeesu shishyulaku neruka jeesina

🎵 AKK-177💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు శిష్యులకు నెరుక జేసిన భవిష్యోక్తులు వినరే కైసరయన గర ప్రాంతములను ఘనుఁడు చేరి తన గతి మతిఁ దలఁచుచు ||యేసు శిష్యులకు||

1వ చరణం

యెరూషలే మనెడి పురమునఁ దన కిఁక కలిగెడు దుఃఖములు దురితాత్ములు యూ దులు కడు బాధలు పరచి తన్ను సిలు వను చంపుదు రని ||యేసు శిష్యులకు||

2వ చరణం

నీతి బోధకు ల నేకులు పెద్దలు ఖ్యాతిగ నర్చకులు అతరిఁదన నప హాస్యము లాడుచుఁ బోతరించి యుమి వేతుర టంచును ||యేసు శిష్యులకు||

3వ చరణం

మనుజ కుమారుఁడు మరణమై సమా ధిని వేయంగఁబడున్ దన రఁగ మూఁడవ దినమునఁ బునరు త్థానమొంది ద ర్శన మిడు మీకని ||యేసు శిష్యులకు||

Report Error