ఎంతో దుఃఖముఁ బొందితివా నాకొర

entoo duhkhamun bonditivaa naakora

🎵 AKK-182💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఎంతో దుఃఖముఁ బొందితివా నాకొర కెంతో దుఃఖము పొంది తివా యెంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకు ఎంతో దిగులయ్యా నాకు ఆ పొంతి పిలాతు యూ దులు నీకుఁ బెట్టిన శ్రమలను దలపోయఁ గా ||ఎంతో దుఃఖముఁ||

1వ చరణం

వచ్చిరి యూదులు ముచ్చట లాడుచు నెచ్చట వాఁడనుచు నిన్ను మచ్చరముతో వారి యిచ్చ వచ్చినట్లు కొట్టి దూషించినారా ||ఎంతో దుఃఖముఁ||

2వ చరణం

సుందరమగు దేహ మందున దెబ్బలు గ్రంధులు గట్టినవా నీవు పొందిన బాధ నా డెందము తలఁపనా నందములే దాయెను ||ఎంతో దుఃఖముఁ||

3వ చరణం

కొట్టుకొట్టుమని తిట్టికేల్ దట్టిని న్నట్టిట్టు నెట్టుచును వారు పెట్టుశ్రమలు తుద మట్టున కోర్చియుఁ బెట్టితివా ప్రాణము ||ఎంతో దుఃఖముఁ||

4వ చరణం

నెపముఁ బెట్టుచుఁ దిట్టి యపహసించుచు యూద చపలులు గొట్టి నారా నా యపరాధములకు నా పదలను బొంది నీ కృప నాకుఁ జూపినావా ||ఎంతో దుఃఖముఁ||

5వ చరణం

చక్కని నా యేసు మిక్కిలి బాధ నీ కెక్కువ గలిగె నయ్యా ఆహా యొక్క దుష్టుఁడీటె ప్రక్కను గ్రుచ్చి తన యక్కస దీర్చుకొనెనా ||ఎంతో దుఃఖముఁ||

6వ చరణం

అన్నదమ్ములైన అక్క సెల్లెం డ్రైనఁ కన్న పిత్రాదు లైన నన్ను ఎన్నఁ డైన బ్రేమించలే రైరి నా యన్నా ప్రేమించినావా ||ఎంతో దుఃఖముఁ||

Report Error