పాపులయెడ క్రీ స్తుని ప్రియ
paapulayeda kree stuni priya
పల్లవి
పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె క ల్వరిగిరిపై నాపదలను దన కీగతిఁ బెట్టెడు కాపురుషుల దెసఁ గనుగొను కృపతో ||పాపులయెడ క్రీ||
1వ చరణం
యెరుషలేము క న్యలు కొందరు తన యెదుట వచ్చి యేడ్చుచు సిలువన్ వరుస నప్పురికి వచ్చు నాశన గతు లెరుఁగఁ బలికి వా రల నోదార్చెను ||పాపులయెడ క్రీ||
2వ చరణం
శత్రువు లటు తనుఁ జంపుచు నుండఁగ మైత్రిఁ జూపె సమ్మతి తోడన్ స్తోత్రముఁ జేసెను దండ్రీ వీరల దురిత మెల్ల క్షమి యింపవె యనుచును ||పాపులయెడ క్రీ||
3వ చరణం
తన ప్రక్కను సిలు వను వేసిన యొక తస్కరుఁ డించుక వేఁడు కొనన్ కనికరము మన మునఁ బెనగొన ని చ్చెను మోక్షము తన తో యుండుటగున్ ||పాపులయెడ క్రీ||
4వ చరణం
మితిలేని దురిత జీవుల లోపల మించి యున్న పతితుల కైనన్ హితముగ మోక్షం బిచ్చుటకై శో ణిత మిచ్చెను నా మతి కది సాక్షిగఁ ||పాపులయెడ క్రీ||